Home   »  తెలంగాణ   »   లోక్ సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామన్న సీఎం రేవంత్

లోక్ సభ ఎన్నికల్లో 14 సీట్లు గెలుస్తామన్న సీఎం రేవంత్

schedule mahesh

Lok Sabha elections | రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో 14 లోక్‌సభ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని ముఖ్యమంత్రి, PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మంగళవారం ధీమా వ్యక్తం చేసారు.

CM said that he will win the Lok Sabha elections

మీడియా ప్రతినిధులతో సీఎం మాట్లాడుతూ కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ సమస్యపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి లేఖ రాసిందని, నివేదిక సమర్పించేందుకు కేంద్ర ఏజెన్సీ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిందని అన్నారు.

14 లోక్‌సభ స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం: CM

కాళేశ్వరం ప్రాజెక్టు కాంగ్రెస్‌కు కొత్త “ఏటీఎం”గా మారిందని మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ, “కాంగ్రెస్ పార్టీ పేదవారి కోసం పని చేస్తుందని, అదే కాంగ్రెస్ ఎజెండా” అని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 14 లోక్‌సభ స్థానాలు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గత కొన్ని నెలలుగా మా పనితీరు ఆధారంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి. పాలనలో పారదర్శకత చూపిస్తామన్నారు.

ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నమన్న సీఎం

కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ క్లియరెన్స్ తర్వాత మార్చి 7 లేదా 8న లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రం నుంచి పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు, పింఛన్లు ఇస్తున్నామన్నారు.

Also Read | అంగన్వాడీల్లో సీసీ కెమెరాలు పెట్టండి: సీఎం రేవంత్ రెడ్డి