Home   »  తెలంగాణ   »   తెలంగాణలో చలి వాతావరణం.. కొన్ని చోట్ల పొగమంచు…

తెలంగాణలో చలి వాతావరణం.. కొన్ని చోట్ల పొగమంచు…

schedule sirisha

weather in Telangana | తెలంగాణలో చలి వాతావరణం మొదలైంది. మూడు రోజుల క్రితం వరకు పగలు, రాత్రి సమయాల్లో ప్రజలు ఉక్కపోతతో ఇబ్బంది పడ్డారు. రుతు పవనాలు తిరుగుముఖం పట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా చల్లని గాలులు వీస్తూ వణుకు పుట్టిస్తున్నాయి. చాలా జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు చేరుకుంటున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉదయాన్నే పొగమంచు వాతావరణం కనిపిస్తుంది.

weather in Telangana| తెలంగాణలో చలి వాతావరణం ప్రారంభం

హన్మకొండలో సాధారణం కంటే 2.7 డిగ్రీలు తక్కువగా 19.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఆదిలాబాద్‌లో 1.8 డిగ్రీలు తగ్గి 17.2 డిగ్రీలుగా నమోదైంది. మిగిలిన జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి.

హన్మకొండ, మెదక్, రామగుండంలో పగటిపూట ఉష్ణోగ్రతలు గత మూడు రోజులుగా పడిపోతున్నాయి. ఖమ్మంలో సాధారణం కంటే 3.3 డిగ్రీలు అధికంగా నమోదైంది. గరిష్ట ఉష్ణోగ్రత 35.2 డిగ్రీలు. హైదరాబాద్, భద్రాచలం, ఆదిలాబాద్‌లలో కూడా సాధారణం కంటే కాస్త ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.