Home   »  తెలంగాణ   »   MLC అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్‌ అధిష్టానం..!

MLC అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్‌ అధిష్టానం..!

schedule mahesh

Congress MLC: MLC అభ్యర్థులపై కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకొంది. MLA కోటాలో ఎన్నుకొనే MLC అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేయడం జరిగింది. బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఫైనల్ చేసింది.

congress-mlc-|the-congress-leadership-has-finali

కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా బల్మూరి వెంకట్ పేరును తెరపైకి తెచ్చి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నెల 18తో నామినేషన్ల స్వీకరణ గడువు ముగుస్తుండడంతో నామినేషన్ కి సిద్దం అవ్వాలని కాంగ్రెస్ హైకమాండ్ సూచించినట్లు తెలుస్తుంది. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తుంగతుర్తి టిక్కెట్టు ఆశించిన అద్దంకి దయాకర్‌కు కాంగ్రెస్ హైకమాండ్ టికెట్ ఇవ్వలేదు.

బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ పేర్లను ఖరారు చేసిన కాంగ్రెస్

ఆయన స్థానంలో BRS పార్టీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన డాక్టర్‌ సామెల్‌కు కాంగ్రెస్‌ హైకమాండ్‌ టికెట్‌ ఇవ్వడం జరిగింది. దింతో కాంగ్రెస్ అధిష్టానం దయాకర్‌ను ఢిల్లీకి పిలిపించి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే MLA టిక్కెట్ కంటే మెరుగైన స్థానం కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ BRS పార్టీ పై ఘన విజయం సాధించింది.

Congress MLC candidates 

తుంగతుర్తి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన మందుల సామేల్‌ 50వేల మెజారితో విజయం సాధించారు. ఇదిలా ఉండగా తాజాగా తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిన రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల్లో ఒకటి అద్దంకి దయాకర్ కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకొంది. ఈ నేపథ్యంలో అద్దంకికి త్వరలో మంత్రి పదవి కూడా వస్తుందనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తుంది. మరొక స్థానం బల్మూరి వెంకట్ కి కేటాయించింది.

NSUI నేతగా గుర్తింపు తెచ్చుకున్న బల్మూరి వెంకట్

ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించబడ్డ కాంగ్రెస్ యువనేత బల్మూరి వెంకట్ NSUI నేతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కూడా MLA టిక్కెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. అయితే వెంకట్‌కు కాంగ్రెస్‌ హైకమాండ్‌ టికెట్‌ ఇవ్వలేదు. తాజాగా బల్మూరి వెంకట్‌కు MLA కోటాలో MLC టిక్కెట్‌ను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ MLAలు ఉండడంతో బల్మూరి వెంకట్ MLC గా ఎన్నిక కావడం లాంఛనం కానుంది.గతంలో ఈటల రాజేందర్ రాజీనామాతో వచ్చిన హుజురాబాద్ MLA ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగిన బల్మూరి వెంకట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ చేతిలో ఓటమి పాలయ్యారు.

Also Read: US నౌకపై క్షిపణి దాడులకు పాల్పడ్డ హౌతీ రెబల్స్