Home   »  తెలంగాణ   »   తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన CP రాధాకృష్ణన్..

తెలంగాణ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన CP రాధాకృష్ణన్..

schedule mounika

TS Governor CP RadhaKrishnan | తెలంగాణ గవర్నర్‌గా జార్ఖండ్ గవర్నర్ CP రాధాకృష్ణన్ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, రాధాకృష్ణన్‌తో ప్రమాణం చేయించారు. హైదరాబాద్ లోని రాజ్ భవన్ లో నిర్వహించిన గవర్నర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ప్రస్తుత జార్ఖండ్ గవర్నర్‌గా కొనసాగుతున్న రాధాకృష్ణన్‌ (TS Governor CP RadhaKrishnan) నేటి నుంచి తెలంగాణకు ఇంఛార్జి గవర్నర్‌గా అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు.

కాగా, తమిళనాడు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న తమిళిసై సౌందరరాజన్ రాజీనామా చేయడంతో రాధాకృష్ణన్‌కు తెలంగాణ ఇంఛార్జి గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. రాధాకృష్ణన్ తెలంగాణకు మూడవ గవర్నర్, ఆయన గతంలో రెండు సార్లు కోయంబత్తూరు నుంచి ఎంపీగా గెలిచారు. అతను గత సంవత్సరం జార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆసక్తికరంగా, 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ముగ్గురు గవర్నర్‌లు తమిళనాడుకు చెందినవారే కావడం గమనార్హం.కాగా ESL నరసింహన్ మరియు తమిళిసై సౌందరరాజన్ కూడా తమిళనాడుకు చెందినవారు.

ALSO READ: రేవంత్ రెడ్డి పై మండిపడ్డ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్..