Home   »  తెలంగాణ   »   TSRTC ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి

TSRTC ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి

schedule mounika
TSRTC

హైదరాబాద్: ఈ రోజు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క TSRTC ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ ప్రయాణికుల సౌకర్యార్థం 25 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. గతంలో ఆర్టీసీ సిబ్బంది జీతాల కోసం ఇబ్బందులు పడేవారన్నారు. రాష్ట్రంలో సింగరేణి, ఆర్టీసీ సంస్థల్లో వేలాది మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపారు.

TSRTC అభివృద్ధికి ప్రభుత్వ సహకారం కొనసాగుతుంది: భట్టి విక్రమార్క

TSRTC అభివృద్ధికి ప్రభుత్వ సహకారం కొనసాగుతుందని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. మహాలక్ష్మిగా కీర్తించబడిన మహిళలు గౌరవప్రదంగా బస్సులో ప్రయాణిస్తారని, వారికి టిక్కెట్టు డబ్బులు ప్రభుత్వమే ఇస్తుందన్నారు. మూడు నెలల్లోనే ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాలు అమలు చేశామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఎమ్మెల్యే దానం నాగేందర్, కార్పొరేటర్ విజయారెడ్డి పాల్గొన్నారు.

ALSO READ: ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్లు దాఖలు చేసిన 16 మంది అభ్యర్థులు..