Home   »  తెలంగాణ   »   దివ్యాంగుల బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలి

దివ్యాంగుల బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలి

schedule raju

హైదరాబాద్: హైదరాబాద్‌లోని సచివాలయం వద్ద దివ్యాంగుల బంధు పథకాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేస్తూ దివ్యాంగులు ఆందోళనకు దిగారు. దివ్యాంగులకు రూ.10 వేలు పింఛను ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ నిరసన చేపట్టారు. దీంతో ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని, పలువురిని అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలను పురస్కరించుకొని దివ్యాంగులకు అందిస్తున్న ఆసరా పింఛన్‌ను రూ.3016 నుంచి రూ.4016కు పెంచుతున్నట్టు సీఎం కేసీఆర్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కొందరు దివ్యాంగులు మాత్రం తమకు నాలుగు వేల పింఛన్ సరిపోదని.. దాన్ని రూ.10 వేలుకు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇస్తోన్న నాలుగు వేల పింఛన్.. సాధారణ ప్రజలకు సరిపోతుందేమో కానీ… నిరుద్యోగులకు, చదువుకుంటున్న వారికి ఏమాత్రం సరిపోదని వాపోతున్నారు. సీఎం కేసీఆర్ సర్కారు మరోసారి ఆలోచించి.. తమకు ఇచ్చే ఫించన్ రూ.10,000 రూపాయలకు పెంచితే అన్ని విధాల సహాయ పడుతుందని వేడుకుంటున్నారు.