Home   »  తెలంగాణ   »   MLC Kavitha | BRS నేత కవిత బంధువుల ఇళ్లలో ED సోదాలు..!

MLC Kavitha | BRS నేత కవిత బంధువుల ఇళ్లలో ED సోదాలు..!

schedule raju

MLC Kavitha | ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు ఊహించని మలుపులు తిరుగుతూ ఉత్కంఠను రేకెత్తిస్తోంది. BRS నేత కవిత ఈడీ కస్టడీలో ఉండగా.. తాజాగా, కవిత, ఆమె భర్తకు సంబంధించిన బంధువుల ఇళ్లలో ED అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

ED searches houses of MLC Kavitha relatives

హైదరాబాద్‌: BRS నేత, ఎమ్మెల్సీ K. కవిత (MLC Kavitha) బంధువుల ఇళ్లలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు ఈరోజు సోదాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ప్రమేయం ఉందన్న ఆరోపణలపై కవితను ఇప్పటికే అధికారులు అరెస్ట్ చేసి ED కస్టడీకి పంపారు.

ఈరోజు ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్న ED అధికారుల బృందం మాదాపూర్‌లోని కవిత భర్త అనిల్ సోదరి, అఖిల ఇంట్లో సోదాలు నిర్వహించింది. అరెస్టయిన BRS నాయకురాలి బంధువులకు చెందిన ఆస్తుల వివరాలు, కవిత గత ఐదేళ్లుగా కూడబెట్టిన ఆస్తుల వివరాలను ED అధికారులు పరిశీలిస్తున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో ముమ్ముర సోదాలు నిర్వహించిన ED అధికారులు, కవితతో పాటు ఆమె భర్త అనిల్ కుమార్ లావాదేవీలు, ఆస్తుల వివరాలపై ఆరా తీశారు. అయితే, కవిత భర్త విచారణకు రావాలని ED నోటీసులు ఇవ్వగా ఆయన విచారణకు హాజరుకాలేదు. ఈ నేపథ్యంలోనే కవిత, అనిల్ బంధువుల ఇళ్లలో సోదాలు చేస్తున్నట్లు సమాచారం.

Also Read: కవిత అరెస్టుపై RS ప్రవీణ్ కుమార్ ట్వీట్