Home   »  తెలంగాణ   »   ప్రచారంలో ఘర్షణ… కాంగ్రెస్, AIMIM కార్యకర్తలపై FIR నమోదు

ప్రచారంలో ఘర్షణ… కాంగ్రెస్, AIMIM కార్యకర్తలపై FIR నమోదు

schedule sirisha

హైదరాబాద్: మలక్‌పేట్ లో శుక్రవారం ఎన్నికల ప్రచారం లో అనుకోకుండా రెండు పార్టీల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణ నేపథ్యంలో కాంగ్రెస్, ఏఐఎంఐఎం కార్యకర్తలపై మాదన్నపేట పోలీసులు రెండు కేసుల పై FIR నమోదు (FIR registered) చేశారు.

జరిగిన గొడవ అనంతరం ఇరువర్గాలపై FIR నమోదు (FIR registered)

శుక్రవారం ప్రార్థనల అనంతరం మలక్‌పేట్ లోని బాగ్-ఈ-జహనారా ప్రాంతంలో ఏఐఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల‌ కార్యకర్తలు ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకుంటూ ఘర్షణకు దిగారు. మలక్‌పేట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థి షేక్ అక్బర్, నియోజకవర్గ ఇన్‌చార్జి ముజఫర్ అలీ ఖాన్, ఇతర పార్టీ కార్యకర్తలతో కలిసి మసీదు-ఇ-అయూబీకి చేరుకుని ప్రార్థనలు చేసుకున్నారు.

అయితే, ప్రార్థనలు ముగించుకుని బయటకు వస్తున్న ప్రజలను కలిసేందుకు కాంగ్రెస్ అభ్యర్థి ప్రయత్నించగా, చావనీ డివిజన్ కార్పొరేటర్ నేతృత్వంలో ఏఐఎంఐఎం కార్యకర్తల బృందం అక్కడికి చేరుకునీ వారిని అడ్డుకోవ‌డంతో ఉద్రిక్త‌త‌ నెలకొంది. ఈ క్ర‌మంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక‌రినొక‌రు తొసుకుంటూ వాగ్వాదానికి దిగారు.

స‌మాచారం అందుకున్న పోలీసులు వెంట‌నే రంగ ప్రవేశం చేసి ఇరు పార్టీల‌ కార్యకర్తలను అక్కడి నుండి వెళ్లగొట్టారు. ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు చోటుచేసుకుండా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లో భాగంగా ఆయా ప్రాంతాల్లో పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు.