Home   »  తెలంగాణ   »   సంతోష్ నగర్‌లోని టిఫిన్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం

సంతోష్ నగర్‌లోని టిఫిన్ సెంటర్‌లో అగ్ని ప్రమాదం

schedule sirisha

Fire at Tiffin Center | హైదరాబాద్‌లోని ఓల్డ్ సంతోష్ నగర్ ప్రాంతంలోని ఓ టిఫిన్ సెంటర్‌లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది.

Fire at Tiffin Center in Santosh Nagar

Fire at Tiffin Center | టిఫిన్ సెంటర్‌లో అగ్నిప్రమాదం

హైదరాబాద్: Fire at Tiffin Center | హైదరాబాద్ ఓల్డ్ సంతోష్ నగర్ ప్రాంతంలోని టిఫిన్ సెంటర్‌లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. అతికష్టం మీద మంటలను అదుపులోకి తెచ్చారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

హైదరాబాద్ గాజులరామారం ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో రెండు రోజుల క్రితం అగ్నిప్రమాదం జరిగినట్లు జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి రంజిత్ తెలిపారు.

జనవరి 2వ తేదీ రాత్రి ఉప్పల్‌లోని CMR షాపింగ్ మాల్‌ లో కూడా అగ్నిప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో చాలా ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటనలో సీ.ఎం.ఆర్ షాపింగ్ మాల్ భవనం మొత్తం దగ్ధమైంది.

హైదరాబాద్ లో 2023లోనే 1000కి పైగా అగ్ని ప్రమాదాలు

2023లో హైదరాబాద్ నగరంలో 1000కి పైగా అగ్ని ప్రమాదాలు సంభవించాయి. ఇందులో పెద్ద, చిన్న సంఘటనలు ఉన్నాయి. దురదృష్టవశాత్తు మరణాలు మరియు గాయాలు, ఆస్తినష్టం జరిగింది.

మండి రెస్టారెంట్‌లో ఇటీవల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయని అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తు మాదాపూర్‌లోని దుర్గం చెరువు మెట్రో స్టేషన్‌ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించడం వల్ల ప్రాణాపాయం తప్పింది.

Also read: CMR షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం..