Home   »  తెలంగాణ   »   ఆదిలాబాద్‌ను కమ్మేసిన పొగమంచు..

ఆదిలాబాద్‌ను కమ్మేసిన పొగమంచు..

schedule sirisha

తెలంగాణ లోని ఆదిలాబాద్‌ జిల్లాను మంచు అలముకున్నది. పల్లెలే కాదు జిల్లా కేంద్రంపై దట్టమైన మంచు కప్పేసింది. ఉదయం 8 గంటలవుతున్నా పొగ మంచు కురుస్తూనే ఉంది.

Fog covered Adilabad

ఆదిలాబాద్‌ (Adilabad) లో దట్టంగా కురుస్తున్న పొగమంచు

ఆదిలాబాద్‌: తెలంగాణలోని ఆదిలాబాద్‌ (Adilabad) జిల్లాను మంచు అలముకున్నది. పల్లెలే కాదు జిల్లా కేంద్రాన్ని దట్టంగా మంచు దుప్పటిలా కమ్మేసింది. ఉదయం 8 గంటలవుతున్నా కూడా పొగ మంచు కురుస్తూనే ఉంది.

పొగ మంచు కారణంగా 44వ నంబర్‌ కశ్మీర్‌-కన్యాకుమారి జాతీయ రహదారిపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు.వాహనదారులు ముందు వచ్చే వాహనాలు ఏమీ కనిపించకపోవడంతో లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణం చేస్తున్నారు. పొగమంచుకు చలి తోడవడంతో ప్రజలు వణుకుతున్నారు.

ఇక నిజామాబాద్‌ జిల్లాలో కూడా పొగమంచు కురిసింది. ఇందూరు పట్టణంలో ఉదయం 8 గంటలవుతున్న పొగ మంచు తీవ్రంగా ఉండటంతో ప్రజలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఎదురుగా ఉన్న మనిషి కూడా కనిపించలేనంతగా మంచు కురుస్తుంది.

Also read: అకాల వర్షం కారణంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ తిప్పలు…