Home   »  తెలంగాణ   »   Fog: తెలంగాణలో మరో మూడు రోజులు వణుకుడే!

Fog: తెలంగాణలో మరో మూడు రోజులు వణుకుడే!

schedule ranjith

తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు దారుణంగా పడిపోతున్నాయి. చలికి ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.

Fog: Three more days of shaking in Telangana!

దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో ఉష్ణోగ్రతలు రోజురోజుకు దారుణంగా పడిపోతున్నాయి. చలికి ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. వాతావరణంలో మార్పులకు తోడు చలిగాలులు కూడా పెరగాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతుండడంతో సాధారణం కంటే చాలా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దిగజారాయి.

దట్టంగా కురుస్తున్న పొగమంచు (Fog)

హైదరాబాద్ వాతావరణ కేంద్రం నివేదికల ప్రకారం, తెలంగాణలో మరో మూడు రోజులు చలి తీవ్రత పెరుగుతుంది. డిసెంబర్ 27, 28, 29 తేదీలలో రాత్రిపూట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు, పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగా 28 నుండి 31 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయి.

కొమురంభీం జిల్లాలో అత్యంత కనిష్ఠంగా 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

అత్యల్పంగా కొమురంభీం జిల్లా కనిష్ఠంగా 8.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది.రానున్న మూడు రోజులలో, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా, కొమురంభీం, మెదక్, నిజామాబాద్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో చలి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది.

Also Read: TSRTC: RTC బస్సుకు తప్పిన పెను ప్రమాదం