Home   »  తెలంగాణ   »   నల్గొండ సభలో ప్రసంగిస్తున్న మాజీ CM KCR

నల్గొండ సభలో ప్రసంగిస్తున్న మాజీ CM KCR

schedule mahesh

Chalo nalgonda meeting | మాజీ CM, BRS అధినేత KCR నల్గొండకు చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభ వేదికపైకి ఆయన కర్ర సాయంతో వచ్చారు. వేదికపై ఉన్న ఆ పార్టీ సీనియర్‌ నేతలు, ఎమ్మెల్యేలు కేసీఆర్‌కు స్వాగతం పలికారు. ఈ సభలో కృష్ణా జలాల వివాదంపై KCR మాట్లాడుతున్నారు.

brs-chalo-nalgonda-public-meeting-on-february13

BRS వచ్చాకే ఫ్లోరైడ్‌ రహితంగా నల్గొండ మారిందన్న KCR

ఇది రాజకీయ సభ కాదు, పోరాట సభ అని నల్గొండ సభను ఉద్దేశించి కేసీఆర్‌ అన్నారు. కృష్ణా, గోదావరి నీళ్లు లేకపోతే మనకు బతుకు లేదని 24ఏండ్ల నుంచి నేను పక్షిలా తిరిగి రాష్ట్రానికి చెబుతున్నా, ఉన్న నీళ్లు కూడా సరిగా లేక నల్గొండలో బతుకులు ఆగమైనయన్నారు. ఫ్లోరైడ్‌ బాధితులను తీసుకెళ్లి ఆనాటి ప్రధాని ముందు పడుకోబెడితే ఎవరూ పట్టించుకోలేదు. BRS ప్రభుత్వం వచ్చాకే ఫ్లోరైడ్‌ రహితంగా నల్గొండ మారిందన్నారు.

ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పారన్న KCR

KCR ఎన్నికల్లో ఓటమిని ప్రస్తావిస్తూ మీకేం కోపం వచ్చిందో ఏం భ్రమలో పడ్డరో తెలీదు కానీ పాలిచ్చే బర్రెను అమ్మి దున్నపోతును తీసుకొచ్చుకున్నరు. ఆ తర్వాత ఏం నడుస్తుందో మీరు కళ్లారా చూస్తున్నారు. చిన్నచిన్న విషయాలు ఫర్వాలేదు. కానీ మన జీవితాలను దెబ్బకొట్టి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పజెప్పారని KCR అన్నారు.

Also Read | BRS బస్సుపై NSUI కాంగ్రెస్ కార్యకర్తల దాడి..!