Home   »  తెలంగాణ   »   Former CM KCR: కేసీఆర్ గాయం పై .. స్పందించిన ప్రధాని మోడీ

Former CM KCR: కేసీఆర్ గాయం పై .. స్పందించిన ప్రధాని మోడీ

schedule ranjith

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఉదయం ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోదీ తెలిపారు.

Former CM KCR: Prime Minister Modi responded to KCR's injury

K.C.R త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన మోదీ

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి K. చంద్రశేఖర రావు గాయం నుండి త్వరగా కోలుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు.”తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి గాయం అయ్యిందని తెలిసి చాలా బాధపడ్డాను. ఆయన త్వరగా కోలుకోవాలని, మంచి ఆరోగ్యం చేకూరాలని ప్రార్థిస్తున్నాను” అని ప్రధాని మోడీ X లో పోస్ట్ చేసారు.

ట్విటర్‌లో ఎమ్మెల్సీ కవిత స్పందన

మరోవైపు కేసీఆర్ గాయంపై ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. ట్విటర్‌లో కవిత..’బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్వల్ప గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో స్పెషలిస్టుల సంరక్షణలో ఉన్నారు. అందరి ప్రార్థనలతో కేసీఆర్‌ త్వరలో పూర్తిగా కోలుకుంటారు. అందరి ప్రేమకు ధన్యవాదాలు’ అని వ్యాఖ్యానించారు.

యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న Former CM KCR

నిన్న(గురువారం) అర్ధరాత్రి మాజీ సీఎం కేసీఆర్ తన ఫామ్‌హౌస్‌లోని బాత్‌రూమ్‌లో జారి పడిపోయారు. ఈసందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ఎడమ కాలుకు రెండు చోట్ల తుంటి గాయమైందన్నారు. అలాగే హిప్ పార్ట్ లో స్టీల్ ప్లేట్ పెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రమాదంలో హిప్ బాల్ దెబ్బతిన్నట్లు వైద్యులు చెబుతున్నారు. దీంతో సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Also Read: హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో చేరిన మాజీ సీఎం కేసీఆర్‌..