Home   »  తెలంగాణ   »   భూకబ్జా ఆరోపణలపై స్పందించిన మాజీ మంత్రి మల్లారెడ్డి..

భూకబ్జా ఆరోపణలపై స్పందించిన మాజీ మంత్రి మల్లారెడ్డి..

schedule mounika

హైదరాబాద్: భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి(Former Minister Mallareddy)స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇది ప్రభుత్వ కక్ష కాదన్నారు.దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని మల్లారెడ్డి స్పష్టం చేశారు.

Former Minister Mallareddy..

భూకబ్జా ఆరోపణలపై కోర్టును ఆశ్రయిస్తా: Former Minister Mallareddy

తనపై వచ్చిన భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. భూకబ్జాతో తనకు ఎలాంటి సంబంధం లేదని, కేసు నమోదైన మాట వాస్తవమేనన్నారు. అయితే ఇది ప్రభుత్వ కక్ష కాదన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని మల్లారెడ్డి స్పష్టం చేశారు.

కాగా, గిరిజనుల భూములు ఆక్రమించారని ఫిర్యాదు అందడంతో మల్లారెడ్డిపై సమీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో SC, ST అట్రాసిటీ కేసు నమోదైంది.

మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు 9 మందిపై కేసులు నమోదు..

47 ఎకరాలు ఆక్రమణకు గురైందని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో మల్లారెడ్డి పై M.R.O తో పాటు ఫిర్యాదు అందడంతో పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మల్లారెడ్డితో పాటు అతని అనుచరులు 9 మందిపై 420 చీటింగ్, SC, ST చట్టాల కింద కేసులు నమోదు చేశారు.

వివరాలు వెల్లడించిన సమీర్‌పేట పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌..

కాగా, సమీర్‌పేట పోలీస్‌ ఇన్‌స్పెక్టర్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. కేశవరం గ్రామంలోని సర్వే నంబర్‌ 33, 34, 35లోని ST (లంబాడీ) హెరిటేజ్‌ భూమి 47 ఎకరాల 18 గుంటలను మాజీ మంత్రి మల్లారెడ్డి, ఆయన 9 మంది బినామీ అనుచరులు అక్రమంగా ఆక్రమించుకున్నారు. మేడ్చల్ మల్కాజిరి జిల్లాలోని మూడు చింతలపల్లి మండలాల్లో మోసం చేసి భూమిని స్వాధీనం చేసుకున్నారని సమీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

మాజీ మంత్రి, ఆయన అనుచరులు, మల్లారెడ్డి బంధువు శ్రీనివాస్‌రెడ్డి, కేశవపూర్‌ గ్రామ మాజీ సర్పంచ్‌ భర్త గోనె హరిమోహన్‌రెడ్డి, సమీర్‌పేట మండల వ్యవసాయ సహకార సంఘం వైస్‌ చైర్మన్‌, సమీర్‌పేట మండల వ్యవసాయ సహకార సేవా సంఘం వైస్‌ చైర్మన్‌ను పోలీసులు విచారించారు. రామిడి మధుకర్ రెడ్డి శివుడు, స్నేహ రామిరెడ్డి, రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డిల పై సమీర్‌పేట పోలీస్ స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, 420 చీటింగ్ కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ALSO READప్రజాసేవ చేయడానికి పార్టీ మారాల్సిన అవసరం లేదు:సుధీర్ రెడ్డి