Home   »  తెలంగాణ   »   Garlic price | కిలో రూ.550కు చేరిన వెల్లుల్లి.. కరీంనగర్‌ జిల్లాలో 40 వేల వెల్లుల్లి చోరీ

Garlic price | కిలో రూ.550కు చేరిన వెల్లుల్లి.. కరీంనగర్‌ జిల్లాలో 40 వేల వెల్లుల్లి చోరీ

schedule ranjith

గత ఏడాది టమాటా ధరలు భారీగా పెరిగితే, ఇప్పుడు వెల్లుల్లి వంతు వచ్చింది. బహిరంగ మార్కెట్ లో కిలో వెల్లుల్లి ధర రూ.500కు చేరింది.

Garlic price | Elligadda reached Rs. 500 per kg.. 40 thousand Elligadda stolen in Karimnagar district

వెల్లుల్లి ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్యుల జేబులు ఖాళీ అవుతున్నాయి. కొద్ది నెలల కిందట కొండెక్కిన టమాటా ధరలు దిగి వచ్చాయి. అయితే, ప్రస్తుతం వెల్లుల్లి మాత్రం జనాలకు చుక్కలు చూపిస్తోంది. బహిరంగ మార్కెట్ లో కిలో వెల్లుల్లి ధర రూ.550కు పెరిగింది. దీంతో పంట పొలాల నుంచే వాటిని కొందరు దుండగులు ఎత్తుకెళ్తున్నారు. దీంతో పంటను కాపాడుకోవడం కోసం కొందరు రైతులు పొలాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు.

కన్నాపూర్‌లో వెల్లుల్లి దొంగలు (Garlic price)

కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కన్నాపూర్‌ గ్రామంలో గుర్తుతెలియని వ్యక్తులు పొలంలో నుంచే వెల్లుల్లి పంటను దోచుకెళ్లారు. గ్రామానికి చెందిన రైతు గుండెవేని శంకర్‌ గ్రామ శివారులోని ఓ గుంట మడిలో వెల్లుల్లి సాగు చేశాడు. పంట ఇటీవల కోతకు రాగా దొంగలు రాత్రి సమయంలో పంట కోసుకువెళ్లారు. దీని విలువ దాదాపు రూ.40 వేలు ఉంటుందని, తనకు న్యాయం చేయాలని బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Also Read | Ginger Garlic Price | భారీగా పెరిగిన వెల్లుల్లి, అల్లం ధరలు