Home   »  తెలంగాణ   »   కార్వాన్ సర్కిల్ పరిధిలో చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలి: రోనాల్డ్ రోస్

కార్వాన్ సర్కిల్ పరిధిలో చేపట్టిన పనులను వెంటనే పూర్తి చేయాలి: రోనాల్డ్ రోస్

schedule mounika

హైదరాబాద్ : కార్వాన్ సర్కిల్ పరిధిలో చేపట్టిన వివిధ పనులను ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి చేయాలని GHMC కమిషనర్ రోనాల్డ్ రోస్ (Ronald Rose) అధికారులను ఆదేశించారు.

హైదరాబాద్ : జనవరి 18వ తేదీ గురువారం కార్వాన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కౌసర్ మొహినుద్దీన్‌తో కలిసి కమిషనర్ సర్కిల్‌లోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కార్వాన్ ఎమ్మెల్యే పలు సమస్యలను కమిషనర్‌కు వివరించారు.

నదీమ్ కాలనీ, షాహతీం కాలనీలో SNDP పనులను పరిశీలించిన Ronald Rose.

నదీమ్ కాలనీ, షాహతీం కాలనీలో వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం(SNDP) పనులను పరిశీలించారు. సాలార్ బ్రిడ్జి జంక్షన్ అభివృద్ధి, మిలటరీ సరిహద్దు మురుగునీటి పైపులైన్, సాలార్ జంగ్ కాలనీలో రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జియాగూడ కబేళాను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కార్వాన్ సర్కిల్ పరిధిలోని ఆదిత్య నగర్ పార్క్, హకీంపేట్, సాలార్ బ్రిడ్జి, టోలిచౌకి, సాలార్ జంగ్ కాలనీ, బంజరు దర్వాజ, నానల్ నగర్, జియాగూడ కాలనీల్లో పారిశుధ్యం, మురుగునీటి పారుదల, నాలా పనులను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. రోడ్డు నిర్వహణ పనులు త్వరితగతిన చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

కమిషనర్‌ వెంట ENC జియా ఉద్దీన్‌, జోనల్‌ కమిషనర్‌ వెంకటేశ్‌ దోత్రే, వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం SEలు కిషన్‌, రత్నాకర్‌, భాస్కర్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్‌ శశిరేఖ, తదితరులు ఉన్నారు.

ALSO READ: మరణించిన కండక్టర్ కుటుంబానికి రూ.40 లక్షల చెక్కు అందజేసిన TSRTC..