Home   »  తెలంగాణ   »   Chityala |నిరుపేద యువతి,యువకులకు GMRM ట్రస్ట్ ఎప్పుడు అండగా ఉంటుంది.

Chityala |నిరుపేద యువతి,యువకులకు GMRM ట్రస్ట్ ఎప్పుడు అండగా ఉంటుంది.

schedule mounika

నిరుపేద యువతి,యువకులకు GMRM ట్రస్ట్ ఎప్పుడు అండగా ఉంటుంది…ఎమ్మెల్యే గండ్ర.

చిట్యాల(chityala) మండలం జూకల్ గ్రామంలోని BNR ఫంక్షన్ హల్ లో GMRM ట్రస్ట్ ఆధ్వర్యంలో చిట్యాల మండల యువతి యువకులకు ఉచిత డ్రైవింగ్ శిక్షణ మరియు అర్హులకు లైసెన్స్ లను అందించే కార్యక్రమం ఏర్పాటుచేయడం జరిగింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకట రమణా రెడ్డి, వరంగల్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి

GMRM ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ గండ్ర గౌతమ్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

అనంతరం ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ…

రవాణా వ్యవస్థలో ,ప్రజాస్వామ్యం వచ్చిన భారత దేశంలో చాలా మార్పులు జరిగాయి. మారుతున్న అవసరాలకు అనుగుణంగా మానవ మనుగడ ముందుకు సాగుతుంది. చాలా చోట్ల నుంచి చాలా ఫోన్ లు వస్తున్నాయి, మాకు డ్రైవింగ్ లైసెన్స్ లేదు అని చాలా మంది నా దృష్టికి తీసుకొచ్చారు.

ఇలాంటి పరిస్థితులకు స్వస్థి పలకాలని మా తండ్రి పేరు మీద స్థాపించిన GMRM ట్రస్ట్ ద్వారా డ్రైవింగ్ తరగతులను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం. డ్రైవింగ్ నేర్పించడం తో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి డ్రైవింగ్ లైసెన్స్ లు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం.

యువతి,యువకులకు ఉపాధి కల్పించాలని, వారి జీవితంలో స్వావలంబన కల్పించాలని నేను ముందుకు రావడం జరిగింది. భూపాలపల్లి జిల్లాలో తొలుత RTO కార్యాలయంలో ప్రతి రోజు 30 స్లాట్స్ ఉంటే ఇప్పుడు వాటిని రోజుకు 60 వరకు పెంచడం జరిగింది. GMRM ట్రస్ట్ ఒక్క డ్రైవింగ్ తరగతులే కాకుండా యువతలో నైపుణ్యం కలిగిన వారికి ఉచితంగా క్రీడలని నిర్వహించడం జరిగింది.

ఉత్తమ ప్రతిభ కనబర్చిన యువతకు బహుమతులను కూడా GMRM ట్రస్ట్ ద్వారా అందించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ అవకాశాలు కల్పించిన క్రమంలో కార్పొరేట్ స్థాయికి తగ్గట్టుగా, నాణ్యమైన విద్య మరియు భోజన సదుపాయాలతో కోచింగ్ అందించాము. గడిచిన 16నెలల నుంచి GMRM ట్రస్ట్ ఆధ్వర్యంలో భూపాలపల్లి ప్రభుత్వ దవాఖానలో ఉచితంగా మధ్యాహ్న భోజనం అందిస్తున్నాం. రానున్న 2లేదా 3 రోజుల్లో GMRM ట్రస్ట్ ద్వారా చిట్యాల(chityala) CHC దవాఖానలో కూడా మధ్యాహ్న భోజన సదుపాయం కల్పిస్తామని హామీ ఇచ్చారు .

దిగ్విజయంగా చిట్యాల(Chityala)వరకు సాగిన GMRM ప్రయాణం.

గండ్ర జ్యోతి మాట్లాడుతూ…

ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి తండ్రి కి. శే గండ్ర మోహన్ రెడ్డి మొదటి నుంచి సమాజ సేవ దృక్పథంతో నడిచిన గొప్పవ్యక్తి . మొదటగా భూపాలపల్లి మండలంలో ప్రారంభమైన ఆయన ప్రయాణం దిగ్విజయంగా చిట్యాల(chityala) వరకు సాగింది. GMRM ట్రస్ట్ ద్వారా ఉపాధి పొందే యువతి, యువకులు ఆలోచించాలి. BRS పార్టీలోకి వచ్చిన నాటి నుంచి భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉంటూ, అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాం.

గండ్ర గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ…

GMRM ట్రస్ట్ ద్వారా దాదాపు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో ఉచిత డ్రైవింగ్ శిక్షణ తరగతులు అందించడం జరిగింది. ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, చివరి గ్రామం వరకు డ్రైవింగ్ తరగతులు మరియు అర్హులకు లైసెన్స్ లు అందిస్తాము. నిరుపేద కుటుంబ సభ్యులకు GMRM ట్రస్ట్ ఎప్పుడు అండగా ఉంటుంది అన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, యువతి యువకులు పాల్గొన్నారు.