Home   »  తెలంగాణ   »   నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న భద్రకాళి అమ్మవారు..

నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతున్న భద్రకాళి అమ్మవారు..

schedule sirisha

తెలంగాణ: రాష్ట్రంలో అత్యంత వైభవంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ఈ రోజు నుండి ప్రారంభం అవుతుంది. మహిళలు ఎంతో గౌరవంగా పూజించే బతుకమ్మను తొమ్మిది (Navaratri) రోజుల పాటు గౌరమ్మగా వివిధ రూపాల్లో పూజిస్తారు.

ఈ నేపథ్యంలో వరంగల్ నగరంలో కాకతీయుల కాలం నుండి ఎంతో విశిష్టత, ప్రాధాన్యత కలిగిన భద్రకాళి ఆలయం లో అమ్మవారు తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో దర్శనం ఇస్తారు. మన రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా సందర్శకులు వచ్చే గొప్ప చరిత్ర కలిగిన భద్రకాళి అమ్మవారు నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది.

భద్రకాళి అమ్మవారి నవరాత్రి(Navaratri) ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

తెలంగాణ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ భద్రకాళి అమ్మవారి శరన్నవరాత్రోత్సవాలకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ప్రధాన అర్చకులు శేషు చెప్పారు. ఈ నెల 14వ తేదీ ఉదయం నుంచి 22వ తేదీ వరకు అమ్మవారి సన్నిధిలో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు వివరించారు.

ఈ శరన్నవరాత్రుల ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

Also read : అమ్మవారి ఆలయాలకు పోటెత్తిన భక్తులు