Home   »  తెలంగాణ   »   Governor |ఆర్టీసీ బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలుప‌డం సంతోషం.

Governor |ఆర్టీసీ బిల్లుకు గ‌వ‌ర్న‌ర్ ఆమోదం తెలుప‌డం సంతోషం.

schedule mounika

తెలంగాణ: టీఎస్‌ ఆర్టీసీ(RTC) కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు గవర్నర్‌(Governor) తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెల్పడం సంతోషమని మంత్రి హరీష్ రావు అన్నారు.

నేడు ఖమ్మంలోని మంత్రి పువ్వాడ నివాసంలో హరీష్ రావు మీడియా సమావేశంలో మాట్లాడుతూ…

ఈ నిర్ణయంతో 43 వేల 373 మంది ఆర్టీసీ(RTC) కార్మికుల జీవితాల్లో కేసీఆర్‌ వెలుగులు నింపారన్నారు.

ఈ నేప‌థ్యంలో ఆర్టీసీ బిల్లుకు గ‌వ‌ర్న‌ర్(Governor)) ఆమోదం తెలుప‌డంతో.. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న ఆర్టీసీ కార్మికుల ఆకాంక్ష ఫలించిందన్నారు.

లక్షలాదిమంది ప్రజలను వారి గమ్యస్థానాలకు చేరుస్తూ జనం హృదయాల్లో ఆత్మీయ చిరునామాగా నిలిచిన ఆర్టీసీకి అండదండలు అందించారన్నారు. 

ఆర్టీసీ మనుగడకు వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించి భరోసా కల్పించామన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇవ్వని విధంగా ఆర్టీసీ ఉద్యోగులకు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చి వేతనాలు పెంచారన్నారు.

పాలమూరు ఎత్తిపోతల పథకం పూర్తి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కె దక్కుతుంది అన్నారు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు వలన జంటనగరాలకు తాగునీరు లభిస్తుంది అన్నారు.

మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వికారాబాదు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 70 మండలాలకు చెందిన 1226 గ్రామాలకు తాగునీరు లభిస్తుంది అన్నారు. మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని పరిశ్రమలకు నీరు అందిస్తాం అన్నారు.

సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టు పనులు చివరి దశలో ఉన్నాయని, మరో మూడు నెలలో పూర్తి అవుతుందన్నారు.

50 ఏళ్లలో కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు ఏం చేసిందని ప్రశ్నించారు?. బీజేపీ, కాంగ్రెస్ ప్రస్తుతం అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఏంచేస్తున్నారు?అని నిలదీశారు. పాలమూరు ఆపేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్, BJP నాయకులు ఎన్నో కుట్రలు చేసారని మండిపడ్డారు.

పాలమూరు ప్రజలపై పగ సాధిస్తున్నారని.. రాబోయే ఎన్నికలలో నోబెల్స్‌కు గ్లోబెల్స్‌కు మధ్య పోటీ జరగబోతోందని అన్నారు.

రైతుల పక్షాన పోరాడే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ అని తేల్చిచెప్పారు. పాలమూరుపై ప్రతిపక్షాలు అపశకునాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.