Home   »  తెలంగాణఉద్యోగంవార్తలు   »   తెలంగాణలో మరో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు గ్రీన్ సిగ్నల్

తెలంగాణలో మరో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు గ్రీన్ సిగ్నల్

schedule raju

హైదరాబాద్: తెలంగాణలో మరో 14,565 ఇంజినీరింగ్ సీట్లకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంజినీరింగ్ కాలేజీలు కంప్యూటర్ కోర్సుల్లో సీట్ల కోసం అనుమతి కోరగా కోర్ గ్రూపుల్లో సీట్లు తిరిగి ఇస్తామని పేర్కొంది. దీంతో ప్రభుత్వం 6,930 సీట్లకు అనుమతులు ఇచ్చింది. అలాగే కొత్తగా 7,635 ఇంజినీరింగ్ సీట్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఫలితంగా అదనపు సీట్లతో ప్రభుత్వానికి ఏటా రూ. 27.39 కోట్ల భారం పడనుంది. ప్రభుత్వం ఇటీవల 86,106 ఇంజినీరింగ్ సీట్లను మంజూరు చేయగా, తాజా అనుమతులతో రాష్ట్రంలోని ఇంజినీరింగ్ సీట్ల సంఖ్య 1,00,671కి చేరుకుంది.