Home   »  తెలంగాణ   »   Group-2 అభ్యర్థి ఆత్మహత్య.. ప్రభుత్వం పరీక్ష వాయిదా వేయడమే కారణమా?

Group-2 అభ్యర్థి ఆత్మహత్య.. ప్రభుత్వం పరీక్ష వాయిదా వేయడమే కారణమా?

schedule sirisha

హైదరాబాద్: హైదరాబాద్ అశోక్ నగర్ హాస్టల్‌లో పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ఓ గ్రూప్-2 అభ్యర్థి(Group-2 candidate) సూసైడ్ చేసుకోవటం కలకలం రేపింది. శుక్రవారం రాత్రి హాస్టల్ గదిలో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

మృతురాలు వరంగల్ జిల్లా బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన ప్రవళిక. హాస్టల్ నుండి బయటకు వెళ్లిన స్నేహితులు తిరిగి వచ్చేసరికి రూమ్‌లో ఆమె ఉరి వేసుకుని కనిపించడంతో వారు హాస్టల్ నిర్వాహకుడికి, పోలీసులకు సమాచారం తెలిపారు. విషయం తెలుసుకున్న విద్యార్థులు, విద్యార్థి సంఘాలు నాయకులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు.

Group-2 candidate ప్రవళిక మృతికి ప్రభుత్వమే కారణం

ప్రవళిక మృతికి ప్రభుత్వమే కారణమంటూ విద్యార్థులు ఆందోళనకు దిగి నిరసనలు చేపట్టారు. తమ తల్లిదండ్రులు అప్పులు చేసి చదివిస్తే ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేసి జీవితాలతో ఆడుకుంటోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వేలాది మంది ఆర్టీసీ క్రాస్ రోడ్ మెట్రో స్టేషన్ కిందకు చేరుకుని నిరసన తెలుపుతున్నారు. పదేళ్లు గడుస్తున్నా గ్రూప్‌ పరీక్షలు నిర్వహించకపోవడంతో ఇప్పుడు మరోసారి వాయిదా వేయడంతో ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు. దీంతో విద్యార్థులు, విద్యార్థి నాయకులపై పోలీసులు లాఠీచార్జి చేసి పలువురిని అరెస్ట్ చేస్తున్నారు.