Home   »  తెలంగాణ   »   రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి : హరీష్ రావు

రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి : హరీష్ రావు

schedule mounika
Harish Rao

హైదరాబాద్: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అకాల వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని BRS నేత, ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) మంగళవారం డిమాండ్ చేశారు.

పంటలపై వడగళ్ల వాన విధ్వంసం సృష్టించింది: హరీష్ రావు

బాధిత రైతులను ఆదుకోవాలని ట్విట్టర్ (X) వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. వడగళ్ల వాన వరి, మొక్కజొన్న పంటలపై విధ్వంసం సృష్టించిందని అన్నారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, మెదక్, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాల్లో బొప్పాయి, మామిడి సహా ఉద్యానవన పంటలు కూడా భారీగా దెబ్బతిన్నాయన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పంట నష్టాల లెక్కింపు చేపట్టి ఎకరాకు రూ.10 వేలు నష్టపరిహారం చెల్లించాలి: Harish Rao

రాజకీయాలు తప్ప, రైతు ప్రయోజనాలు పట్టని కాంగ్రెస్, ఇప్పటికైనా మేల్కొని అన్నదాతకు అండగా నిలవాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పంట నష్టాల లెక్కింపు చేపట్టి ఎకరాకు రూ.10 వేలు నష్టపరిహారం చెల్లించాలన్నారు. గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పంటలకు నష్టం వాటిల్లుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదన్నారు. గతేడాది అకాల వర్షాల వల్ల పెద్దఎత్తున పంటనష్టం జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి K చంద్రశేఖర్‌రావు తక్షణమే బాధిత ప్రాంతాలను సందర్శించారు. నష్టపోయిన రైతులకు అక్కడికక్కడే నష్ట పరిహారం కింద ఎకరాకు రూ.10వేలు చెల్లించాలని KCR ఆదేశించారని హరీష్ రావు గుర్తు చేశారు.

ALSO READ: Telangana new Governor | తెలంగాణ కొత్త గవర్నర్ ఎవరో తెలుసా..?