Home   »  తెలంగాణ   »   గోల్కొండ పరిసరాల్లో భారీ బందోబస్తు

గోల్కొండ పరిసరాల్లో భారీ బందోబస్తు

schedule raju

ఈ నెల 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని Cm Kcr గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేయనున్నారు. ఈ నేపథ్యంలో గోల్కొండ పరిసరాల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. రెండు, మూడు రోజుల నుంచి అక్కడ పోలీసులు ఇండిపెండెన్స్‌ డే వేడుకల రిహార్సల్స్‌ కూడా చేస్తున్నారు. కౌంటర్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్, ఆక్టోపస్, ఎస్‌బీ, సీఏఆర్, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్, సిఆర్పిఎఫ్, తెలంగాణ స్టేట్ పోలీస్, సిటీ సెక్యూరిటీ వింగ్ తదితర బృందాలతో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు.

 శుక్రవారం కూడా పోలీసులు తమ రిహార్సల్స్ ను కొనసాగించారు. అడిషనల్ డీజీపీ స్వాతిలక్రా రిహర్సల్స్‌ను పర్యవేక్షించారు. సుమారు 400 మంది పోలీసులు ఈ రిహార్సల్స్ లో పాల్గొన్నారు. కోటకు చుట్టూ ఐదు కిలోమీటర్ల పొడవునా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, ఈ నెల 15న స్వాతంత్య్రదిన వేడుకల ఏర్పాట్లపై ఇప్పటికే CS శాంతి కుమారి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. వేడుకల్లో ఉదయం 10 గంటలకు సీఎం కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అంతకు ముందు సికింద్రాబాద్‌ పరేడ్‌గ్రౌండ్‌లో అమరవీరుల స్మారకస్థూపం వద్ద స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులు అర్పిస్తారు