Home   »  తెలంగాణ   »   Immerse Ganesh idols |గణేష్ విగ్రహాల నిమజ్జనానికి హైకోర్టు ఆంక్షలు

Immerse Ganesh idols |గణేష్ విగ్రహాల నిమజ్జనానికి హైకోర్టు ఆంక్షలు

schedule sirisha

హైదరాబాద్: హుస్సేన్ సాగర్ సరస్సులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీఓపీ)తో తయారు చేసిన గణేష్ విగ్రహాల నిమజ్జనం (Immerse Ganesh idols) వల్ల నీరు కలుషితం అవుతుందని తెలంగాణ హైకోర్టు ఒక సంచలన తీర్పుని వెల్లడించింది.

పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కు ఆదేశాలు జారీ

ప్రధాన న్యాయమూర్తి అలోక్ ఆరాధే, న్యాయమూర్తి ఎన్‌వి శ్రవణ్ కుమార్‌లతో కూడిన న్యాయస్థానం, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్, పౌర అధికారులను కూడా హుస్సేన్ సాగర్ లో ఎటువంటి పిఒపి విగ్రహాన్ని నిమజ్జనం చేయకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారు చేసిన గణేష్ విగ్రహాలను పూర్తిగా నిషేధించాలంటూ కాలుష్య నియంత్రణ మండలి (PCB)) మార్గదర్శకాలను పరిగణలోకి తీసుకొని తెలంగాణ గణేష్ మూర్తి కళాకార సంక్షేమ సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఉత్తర్వులను జారీ చేశారు.

గణేష్ విగ్రహాల నిమజ్జనం (Immerse Ganesh idols) కోసం హైకోర్టు సంచలన తీర్పు

పర్యావరణ పరిరక్షణకు హైకోర్టు విచారం చేపట్టి ఒక నిర్ణయానికి వచ్చింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (POP) తో తయారు చేసిన విగ్రహాల నిమజ్జనానికి కొన్ని ఆంక్షలు విధించింది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC), హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) మరియు పోలీసులు వారి ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు.

నగరం నడిబొడ్డున ఉన్న నీటి వనరులను కలుషితం చేయకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశాలను జారీ చేసింది.

Also read : నిమజ్జనం పోలీసులకు ఒక టాస్క్ లాంటిది.. ఎందుకంటే.. ?