Home   »  తెలంగాణ   »   రానున్న 5 రోజులు మరింత చలి పెరిగే అవకాశం

రానున్న 5 రోజులు మరింత చలి పెరిగే అవకాశం

schedule sirisha

తెలంగాణ: Winter | రానున్న ఐదు రోజులు తెలంగాణలో చలి తీవ్రత పెరగనున్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని KVK వాతావరణ విభాగం శాస్త్రవేత్త శ్రీలక్ష్మి మంగళవారం తెలిపారు. కరోనా విస్తరిస్తున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు.

Winter

Winter | రానున్న ఐదు రోజులు జిల్లాలో చలి తీవ్రత పెరగనున్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని KVK వాతావరణ విభాగం శాస్త్రవేత్త శ్రీలక్ష్మి మంగళవారం తెలిపారు. ఈశాన్య, తూర్పు దిశల నుంచి రాష్ట్రం వైపు వీస్తున్న గాలుల ప్రభావంతో రానున్న ఐదు రోజుల్లో ఉమ్మడి జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రతలు 14.3 నుంచి 15.8 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉందనే ఆమె తెలిపారు. కరోనా విస్తరిస్తున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు.

రైతులకు సూచనలు ఇచ్చిన శాస్త్రవేత్త శ్రీలక్ష్మి

నాలుగు నుంచి ఏడు కిలోమీటర్ల వేగంతో చలి గాలులు వీస్తాయన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు నారుమడిలో చలితీవ్రతను తగ్గించడానికి సాయంత్రం నీరు పెట్టి ఉదయం తీసేయాలని లేదంటే ప్లాస్టిక్‌ షీట్లను నారుమడిపై కప్పి ఉంచాలని శాస్త్రవేత్త శ్రీలక్ష్మి తెలిపారు.

నాట్ల సమయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె అన్నారు. మాగిన కోళ్ల లేదా గొర్రెల ఎరువు లేదా వర్మి కంపోస్టు ఎరువు వాడి వెచ్చదనం పెంచాలని చెప్పారు. ఐదు రోజుల పాటు ఉష్ణోగ్రతల్లో మార్పు అధికంగా ఉండే అవకాశం ఉండడంతో ప్రజలు రాత్రి ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని తెలిపారు.

Winter | కనిష్ఠ స్థాయికి పడిపోయాయిన ఉష్ణోగ్రతలు

తెలంగాణలో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయినట్టు వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్‌ జిల్లా నెరడిగొండలో 12.3 డిగ్రీలు, నిర్మల్‌ జిల్లా పెంబిలో 13.1, సిద్దిపేట జిల్లా కొండపాకలో 13.5, జగిత్యాల జిల్లా మల్లాపూర్‌లో 13.6, మంచిర్యాల జిల్లా జిన్నారంలో 13.9, పెద్దపల్లి జిల్లా మంథని మండలంలో 13.9, మెదక్‌ జిల్లా దామరంచలో కనిష్ఠ ఉష్ణోగ్రత 14.3 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 11 నుంచి 15 డిగ్రీల మధ్య కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణశాఖ పేర్కొంది. తెలంగాణవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టడంతో ఉదయం వేళల్లో పొగమంచు కురుస్తుంది.

పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం

ప్రధాన రహదారులపై పొగమంచు కారణంగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. ఏపీలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది. రెండురోజుల పాటు దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.

గ్రేటర్‌ హైదరాబాద్‌ లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. మంగళవారం కనిష్ఠ ఉష్ణోగ్రతలు 13.3 డిగ్రీలుగా, గాలిలో తేమ 36 శాతంగా నమోదైనట్టు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Also read: 3 రోజుల పాటు తెలంగాణలో అధిక చలి