Home   »  తెలంగాణ   »   గోదావరిఖని డిపోకు రూ.1.3 కోట్ల ఆదాయం

గోదావరిఖని డిపోకు రూ.1.3 కోట్ల ఆదాయం

schedule ranjith
Godavarikhani depot | 1.3 crores income for Godavarikhani depot

Godavarikhani depot | ఈ సంవత్సరం సమ్మక్క సారక్కలను దర్శించుకునేందుకు మేడారానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కిక్కిరిసిన క్యూలైన్లలో గంటల తరబడి వేచిచూసి మరీ అమ్మలకు మొక్కులు అప్పజెప్పారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించి, నేరుగా దర్శనానికి వచ్చారు. ఎత్తు బెల్లం, ఒడిబియ్యం, చీరెలు సమర్పించి, పిల్లాజెల్లా, గొడ్డుగోదను చల్లంగ చూడాలని వేడుకున్నారు.

గోలివాడ జాతరకు రూ.4.26 లక్షల ఆదాయం (Godavarikhani depot)

మేడారం జాతర సందర్భంగా గోదావరిఖని RTC డిపోకు రూ.1.3 కోట్ల ఆదాయం వచ్చిందని డిపో మేనేజర్‌ నాగభూషణం తెలిపారు. ఈ నెల 18 నుంచి 25 వరకు డిపో నుంచి 135 బస్సులతో 1077 ట్రిప్పుల ద్వారా జాతరకు భక్తులను తరలించమన్నారు. అలాగే మినీ మేడారంగా పిలిచే గోలివాడ సమ్మక్క సారక్క జాతరకు 12 బస్సులతో 144 ట్రిప్పుల ద్వారా రూ.4.26 లక్షల ఆదాయం వచ్చిందన్నారు. బస్టాండ్‌ వద్ద భక్తులకు సహకరించిన 1100, 1155 వాలంటీర్లు, లయన్స్‌ క్లబ్‌ వారికి డిపో మేనేజర్‌ కృతజ్ఞతలు తెలిపారు.

Also Read | ఇంటర్మీడియట్ పరీక్షలకు ఏర్పాట్లు చేస్తున్న TSRTC.!