Home   »  తెలంగాణ   »   Kalvakuntla Kavitha | 14 రోజుల రిమాండ్‌.. తీహార్‌ జైలుకు కల్వకుంట్ల కవిత..!

Kalvakuntla Kavitha | 14 రోజుల రిమాండ్‌.. తీహార్‌ జైలుకు కల్వకుంట్ల కవిత..!

schedule raju

Kalvakuntla Kavitha | ఢిల్లీ లిక్కర్‌ పాలసీ కేసులో మంగళవారం కీలక పరిణామం చోటు చేసుకుంది. BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు రూస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించింది. దీంతో అధికారులు ఆమెను తీహార్‌ జైలుకు తరలించనున్నారు.

Kalvakuntla Kavitha will go to Tihar Jail on 14-day remand

కోట్లాది రూపాయల ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన BRS ఎమ్మెల్సీ K.కవితను (Kalvakuntla Kavitha) ఈరోజు మధ్యాహ్నం రూస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ED న్యాయవాది జోయాబ్ హుస్సేన్ మద్యం కుంభకోణం కేసుకు సంబందించిన సమాచారం విన్నవించిన తర్వాత, కవితను 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి కోరారు. న్యాయవాది ఆన్‌లైన్‌లో తన వాదనను అందజేస్తూ, కేసు పురోగతిలో ఉందని, ఇంకా చాలా మందిని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.

Kalvakuntla Kavithaకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ

చిన్న కొడుకు పరీక్షల షెడ్యూల్ విడుదలైందని, ఆమెకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టులో అభ్యర్ధనను సమర్పించారు. అయితే బెయిల్ అభ్యర్థనను ED న్యాయవాది వ్యతిరేకించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కవితకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 9 వరకు రిమాండ్ కొనసాగుతుందని, ఆమెను తీహార్ జైలుకు తరలించనున్నట్లు సమాచారం.

అయితే, కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ ఏప్రిల్ 1న విచారణకు రానుంది. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇది తప్పుడు కేసు. ఇది మనీలాండరింగ్ కేసు కాదు, రాజకీయ లాండరింగ్ కేసు. నేను నిరపరాధిగా బయటకు వస్తాను. వారు నన్ను తాత్కాలికంగా కటకటాల వెనుక ఉంచవచ్చు. నా ఆత్మవిశ్వాసాన్ని ఎవరూ దెబ్బకొట్టలేరు. నిందితుల్లో ఒకరు ఇప్పటికే BJPలో చేరారు. మరొకరు పార్టీ టిక్కెట్‌ తీసుకున్నారు. మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా BJPకి రూ.50 కోట్లు ఇచ్చాడు. జై తెలంగాణ, జై KCR అంటూ నినాదాలు చేస్తూ కోర్టులోకి ప్రవేశించారు.

Also Read: కవితను కోర్టులో హాజరుపర్చిన ED.. కస్టడీ పొడిగింపు..!