Home   »  తెలంగాణ   »   తెలంగాణ శాసనసభ పక్ష నేతగా కేసీఆర్..

తెలంగాణ శాసనసభ పక్ష నేతగా కేసీఆర్..

schedule mounika

హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శనివారం బిఆర్‌ఎస్ శాసనసభ పక్ష (KCR as leader of Telangana Legislature)పార్టీ నాయకుడిగా ఎన్నికయ్యారు.

KCR as leader of Telangana Legislature

భారత రాష్ట్ర సమితి శాసనసభ్యులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను తమ శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. తెలంగాణ భవన్‌లో శనివారం ఉదయం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. సీనియర్ నేత కే కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్టీకి చెందిన 38 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. మాజీ ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ శస్త్ర చికిత్స చేయించుకోవడంతో హాజరుకాలేకపోయారు.

KCR as leader of Telangana Legislature|కేసీఆర్ ను తమ నేతగా ఏకగ్రీవ తీర్మానం..

ఇటీవల, శాసనసభ ఎన్నికల్లో, BRS 39 నియోజకవర్గాల్లో విజయం సాధించింది మరియు శాసనసభలో ప్రధాన ప్రతిపక్షంగా పనిచేయడానికి సిద్ధంగా ఉంది.

ఈ నేపథ్యంలో తమ శాసనసభా పక్ష నేతను ఎన్నుకునేందుకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు శనివారం సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి చంద్రశేఖర్‌రావు పేరును ప్రతిపాదించగా, మాజీ మంత్రులు టీ శ్రీనివాస్‌ యాదవ్‌, కడియం శ్రీహరి బలపరిచారు. ఈ సమావేశంలో కేసీఆర్ ను తమ నేతగా ఎంపిక చేస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు.

కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 119 స్థానాలకు గాను బీఆర్‌ఎస్ 39 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్‌ 64 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ, ఏఐఎంఐఎం, సీపీఐ వరుసగా 8, 7, 1 సీట్లు గెలుచుకున్నాయి.

ALSO READ: నేడు బీఆర్ఎస్ శాసనసభాపక్ష భేటీ..బీఆర్ఎస్‌ ఎల్పీ నేత ఆయనే?