Home   »  తెలంగాణవార్తలు   »   “మమ్మల్ని ఎందుకు అంతగా బాధ పెడుతున్నారు?’’ అని కేటీఆర్ ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు

“మమ్మల్ని ఎందుకు అంతగా బాధ పెడుతున్నారు?’’ అని కేటీఆర్ ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు

schedule sirisha

హైదరాబాద్: తెలంగాణ 10వ వార్షికోత్సవ వేడుకలపై భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్‌ నుండి వచ్చిన విమర్శలపై ఐటి శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ‘ముందు చూపుతో’ తెలంగాణ అభివృద్ధిలో మేము చాలా సాధించాం. మా విజయాలను జరుపుకునే హక్కు మాకు ఉంది. “మమ్మల్ని ఎందుకు అంతగా బాధ పెడుతున్నారు?’’ అని కేటీఆర్ ప్రతిపక్ష పార్టీలపై విమర్శలు గుప్పించారు.

వరంగల్ నగరం బహిరంగసభలో మాట్లాడిన కేటీఆర్.. ‘నన్నపనేని నరేందర్’ నేతృత్వంలోని నియోజకవర్గ అభివృద్ధికి కేసీఆర్ పెద్దఎత్తున నిధులు కేటాయించారన్నారు.

2014లో రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో పాటు ఇతర రంగాల్లో వరంగల్ అపూర్వమైన అభివృద్ధిని సాధించిందని ఆయన కొనియాడారు.

కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, ములుగులో గిరిజన యూనివర్సిటీకి సంబంధించి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందా అని కేటీ రామారావ్ అన్నారు.