Home   »  తెలంగాణ   »   హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై, తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్‌లో ఆకాశం మేఘావృతమై, తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం

schedule sirisha

హైదరాబాద్: నవంబర్ 7, 8 తేదీల్లో నగరంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) అంచనా వేస్తుంది. హైదరాబాద్‌ వాతావరణం (weather in Hyderabad)లో చాలా మార్పులు వచ్చాయి. చలికాలం లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. ఈ వారం రోజుల పాటు ఆకాశం మేఘావృతమైన ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. మంగళ, బుధవారాల్లో ఉదయం G.H.M.C పరిధిలోని ఆరు జోన్లలో వర్షం కురిసే అవకాశం ఉంది.

పలు మార్పులకు లోనైన హైదరాబాద్‌ వాతావరణం(weather in Hyderabad)

దక్షిణ తమిళనాడు పరిసర ప్రాంతాల్లో తుఫాను సర్క్యులేషన్ ఉందని IMD తెలిపింది. ఇది రానున్న మూడు రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశలో ఆగ్నేయాన ఆనుకుని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం వైపు కదులుతుందని తెలంగాణలో వర్షాలు కురుస్తాయని IMD వెల్లడించింది.

అదనంగా, తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (TSDPS) వారంలో తెలంగాణలోని దక్షిణ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

58 ఏళ్లలో హైదరాబాద్‌లో సింగిల్ డిజిట్ వర్షపాతం నమోదు

హైదరాబాద్‌లో 58 ఏళ్లలో అక్టోబరు అత్యంత పొడిగా ఉందని IMD వెల్లడించింది. హైదరాబాద్‌ లోని బండ్లగూడలో 31 రోజుల్లో 4.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

1950 నుండి, అక్టోబర్‌లో నగరంలో సింగిల్ డిజిట్ వర్షపాతం నమోదైన రెండేళ్లు మాత్రమే ఉన్నాయి. 1965లో నగరంలో అత్యధిక వర్షపాతం నమోదు కాగా, 1967లో అక్టోబర్‌లో 6 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ ఏడాది 4.8 మి.మీ. వర్షపాతం నమోదైందని పేర్కొన్నారు. అక్టోబర్‌లో సగటున నగరంలో 109 మి.మీ వర్షపాతం నమోదైంది.