Home   »  తెలంగాణ   »   ఫిలింనగర్‌లో విషాదం.. ఈతకు వెళ్లి యువకుడు మృతి

ఫిలింనగర్‌లో విషాదం.. ఈతకు వెళ్లి యువకుడు మృతి

schedule ranjith
Film Nagar | Tragedy in Filmnagar.. Youth dies after going swimming

Film Nagar | వేసవి సెలవుల వేళ సరదాగా ఈత కోసం వెళ్లిన ఇద్దరు యువకుల్లో, ఒకరు మృతి చెందిన సంఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే నిన్న మధ్యాహ్నం పవన్‌రాజ్‌ అనే యువకుడు, తన స్నేహితుడితో కలిసి ఫిల్మ్ నగర్ (Film Nagar) పరిధిలోని హకీందర్గా వద్ద ఉన్న చెరువులోకి ఈతకు వెళ్లారు. ఇద్దరు యువకులు ఈత కొట్టడానికి చెరువులో దూకారు. ఈ క్రమంలో పవన్‌రాజ్‌ కనిపించకుండా పోయాడు.

మరొక యువకుడు చెరువు నుంచి బయటపడి పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) బృందానికి సమాచారమిచ్చారు. సమాచారం తెలుసుకున్న వెంటనే చెరువు వద్దకు చేరుకున్న NDRF బృందాలు పవన్‌కోసం గాలించాయి. నిన్న సాయంత్రం నుంచి పవన్‌ రాజ్‌ కోసం వెతుకుతుండగా, ఇవాళ శవమై దొరికాడు. అనంతరం పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read | పెళ్లి కార్డులు ఇవ్వడానికి వెళ్లి మృతి చెందిన యువకుడు