Home   »  తెలంగాణ   »   రికార్డు స్థాయిలో మానేరు డ్యామ్‌కు వరద

రికార్డు స్థాయిలో మానేరు డ్యామ్‌కు వరద

schedule sirisha

తెలంగాణలో వరుసగా కురిసిన వర్షాల వల్ల అన్ని చెరువులు, కుంటలు, డ్యామ్‌ లు రికార్డు స్థాయిలో నిండిపోయాయి. ప్రజల జీవనం అతలాకుతలం అయింది. ఈ నేపథ్యంలోనే మానేరు డ్యాం 58ఏళ్ల చరిత్రలో గత జులైలో రికార్డు స్థాయిలో 8.020 మీటర్ల వరద నమోదైంది. మంథని మండలం అడవిసోమన్‌పల్లిలో మానేరు ఒడ్డున ఏర్పాటు చేసిన వాటర్‌ లెవల్‌ గేజింగ్‌ కేంద్రంలో ప్రవాహాన్ని నమోదు చేస్తారు.

మానేరుకు 1989లో మొదటిసారి అత్యధికంగా 7.604 మీటర్ల వరకు వరద రాగా మళ్ళీ ఈ జులై 28న రికార్డు స్దాయి 8.020 మీటర్ల వరకు నమోదయింది. భూపాలపల్లి జిల్లాలో 23 చెరువులకు గండ్లు పడగా మానేరు సమీపంలోని పంట పొలాలన్నీ నీట మునిగాయి ఈ వరదల వల్ల రైతులకు తీవ్ర నష్టం జరిగింది.