Home   »  ఉద్యోగంతెలంగాణ   »   మెడికల్‌ కాలేజీ సెప్టెంబర్‌లో ప్రారంభం… ఎక్కడంటే.?

మెడికల్‌ కాలేజీ సెప్టెంబర్‌లో ప్రారంభం… ఎక్కడంటే.?

schedule raju

వచ్చే నెలలో సిరిసిల్లలో మెడికల్‌ కాలేజీ ని CM కేసీఆర్‌ ప్రారంభిస్తారని మంత్రి KTR తెలిపారు. మెడికల్‌ కాలేజీ ఏర్పాటుతో 150 మంది డాక్టర్లు నిరంతరం అందుబాటులో ఉంటారని చెప్పారు. అన్ని రోగాలకు ప్రత్యేక వైద్యులతో మెరుగైన వైద్యం అందుతుందన్నారు. చిన్న రోగం నుంచి క్యాన్సర్‌ వరకు ఉచితంగా వైద్యసేవలు జిల్లాలో పేద ప్రజలకు అందించనున్నట్లు కేటీఆర్‌ తెలిపారు.

గత నెల 31వ తేదీన ప్రభుత్వం సిరిసిల్ల, కరీంనగర్‌ జిల్లాల ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల నిర్మాణం కోసం టెండర్లు పిలిచింది. ఇందులో కరీంనగర్‌ కాలేజీకి రూ.104.5 కోట్లు, రాజన్న సిరిసిల్ల కాలేజీకి రూ.107.3 కోట్లు అంచనాగా పేర్కొంది. టెండర్ల ప్రక్రియ రెండు వారాల్లో ముగిసి, దక్కించుకున్న సంస్థ సెప్టెంబర్‌లో పనులు ప్రారంభించనున్నట్లు సమాచారం. పనులు మొదలైన 15 నెలల్లోగా నిర్మాణాలు పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. ఈలోగా నీట్‌ కౌన్సెలింగ్‌ ముగిసి, 2023–24 విద్యాసంవత్సరానికి సంబంధించిన తరగతులు తాత్కాలిక భవనాల్లో ప్రారంభం కానున్నాయి.