Home   »  తెలంగాణ   »   MLA మైనంపల్లి … దారెటు ?

MLA మైనంపల్లి … దారెటు ?

schedule vamshi

హైద్రాబాద్: మల్కాజిగిరి MLA మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడికి మెదక్‌ BRS MLA టికెట్‌ దక్కకపోవడం తో తీవ్ర అసంతృప్తిగా వున్నాడని తెలుస్తుంది. రేపు మైనంపల్లి తన రాజకీయ భవిష్యత్తు పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రేపు తన ముఖ్య అనుచరులు, కార్పొరేటర్లు, అభిమానులతో సమావేశం కానున్న ఆయన తదుపరి కార్యాచరణ పై అందర్నీ సంప్రదించి ఓ నిర్ణయం వెల్లడించనున్నారు.