Home   »  తెలంగాణ   »   MLC Rathore: కాంగ్రెస్ ని పార్టీ గెలిపించటం మన బాధ్యత..

MLC Rathore: కాంగ్రెస్ ని పార్టీ గెలిపించటం మన బాధ్యత..

schedule mounika

నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశం ముఖ్యఅతిథిగా హాజరైన కర్ణాటక ఎమ్మెల్సీ రాథోడ్ ప్రకాష్(MLC Rathore Prakash). ఎవరికి టికెట్ వచ్చిన కలిసి పని చేయాలని సూచించారు.

ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది.

ఎమ్మెల్సీ రాథోడ్ ప్రకాష్(MLC Rathore Prakash) మాట్లాడుతూ..ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యధికంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకున్నది బోథ్ నియోజకవర్గం అని తెలిపారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపించటం మన బాధ్యత అన్నారు. 17వ తేదీ న కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సభలో ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరుఅవుతారని అన్నారు.

దరఖాస్తు చేసుకున్న 18 మంది అభ్యర్థులలో అధిష్టానం ఒక్కరిని ఎంపిక చేసినప్పుడు మిగతా వారందరూ కలిసి మద్దతుగా ఉండి గెలిపించుకోవాలని సూచించారు.

రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుందని టికెట్ ఇవ్వలేదని పార్టీని వదిలిపోవడం గాని, అభ్యర్థికి మద్దతు ఇవ్వకపోవడం గాని చేయకూడదని ఎమ్మెల్యే దరఖాస్తు అభ్యర్థులకు కోరారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడకపోయినప్పటికీ నిరాశానిస్ప్రహలకు గురికాకుండా పార్టీ పటిష్ఠత, కార్యకర్తలను కాపాడుకోవడం, ప్రజల శ్రేయస్సుపై దృష్టిసారించడం సంతోషించదగ్గ విషయమన్నారు.

తెలంగాణలో బీఆర్‌ఎస్‌ పాలనపై ప్రజలు పూర్తిగా విసుగెత్తిపోయారని, ఎక్కడికి వెళ్లినా కాంగ్రెస్ ను ఆదరించేందుకు ఉత్సాహం చూపుతున్నారని తెలిపారు. తెలంగాణలో ఈనెల 16, 17 తేదీలలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాన్ని హైదరాబాద్‌లో నిర్వహిస్తోంది.

17వ తేదీన సాయంత్రం కాంగ్రెస్ పార్టీ విశ్వాసాలను ప్రవేశ పెట్టబోతుందని, అట్టి గ్యారెంటీలను 18వ తేదీన తమ జిల్లాలో, నియోజక వర్గాల్లో ఇంటి ఇంటికి తిరిగి ప్రజలకు తెలియపరచాలని అన్నారు. ఈ క్రమంలోనే సెప్టెంబర్ 17వ తేదీన భారీ ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ విజయవంతం చేయాలన్నారు.

ఈ సభకు కాంగ్రెస్ అగ్రనేతలంతా హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి దరఖాస్తు చేసుకున్న వారు, కాంగ్రెస్ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.