Home   »  తెలంగాణ   »   ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం .. బాలింతకు ప్రాణాపాయం…

ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం .. బాలింతకు ప్రాణాపాయం…

schedule sirisha

మంచిర్యాల: ప్రాణాలు కాపాడాల్సిన వైద్యులు కొన్ని సార్లు ప్రాణాపాయం కలిగిస్తున్నారు. వైద్యం చేసే సమయంలో నిర్లక్ష్యంగా ఉంటూ రోగుల ప్రాణాలపై తీసుకువస్తున్నారు. అయితే మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల ఓ బాలింత ప్రాణాల మీదకు వచ్చింది.

వేమనపల్లి మండలం నీల్వాయికి చెందిన కీర్తి లయ అనే మహిళ పురిటి నొప్పులతో 5 రోజుల క్రితం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. ఆపరేషన్‌ చేసి కడుపులోనే కాటన్ పాడ్‌ మరచిపోయి వైద్యులు కుట్లు వేసి పంపించారు. ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే కొద్ది రోజుల తర్వాత తీవ్ర అస్వస్థతకు గురైంది.

సోమవారం రాత్రి చెన్నూర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ లయ కు టెస్టులు నిర్వహించిన డాక్టర్లు ఆమె కడుపులో కాటన్ ప్యాడ్ ఉందని చెప్పారు. ఆపై ఆపరేషన్ చేసి కాటన్‌ ని బయటకు తీశారు. దీంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడిందని డాక్టర్లు చెప్పారు.