Home   »  తెలంగాణఉద్యోగంవార్తలు   »   రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌

schedule raju

తెలంగాణ: రాష్ట్రంలో మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ రిలీజైంది. 1520 మల్టీ పర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసినట్లు మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ‘ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగ మేళా కొనసాగుతుంది. కమిషనర్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ విభాగంలో పోస్టులు ఉంటాయి. అభ్యర్థులకు ఆల్‌ది బెస్ట్‌’ అని హరీశ్‌ వెల్లడించారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్‌ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు https://mhsrb.telangana.gov.in/MHSRB/home.htm వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు. ఆశావాహులకు ఈ సందర్భంగా మంత్రి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఆగస్టు 25న ప్రారంభం కాగా.. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 19ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.