Home   »  తెలంగాణ   »   ‘సచివాలయంలో’ ప్రార్ధనా మందిరాలు ప్రారంభం

‘సచివాలయంలో’ ప్రార్ధనా మందిరాలు ప్రారంభం

schedule raju

తెలంగాణ: నూతన సచివాలయంలో ఆలయాల ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి. మొదట నల్ల పోచమ్మ ఆలయంలో గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేకపూజలు చేశారు. అనంతరం చర్చిలో ప్రార్థనలు చేసి కేక్‌ కట్‌ చేశారు. ఆ తర్వాత ముస్లిం సంప్రదాయానికి అనుగుణంగా మతపెద్దల సమక్షంలో ప్రారంభ కార్యక్రమం జరిగింది.

సచివాలయం ఆవరణలో నిర్మించిన ఆలయంలో శివుడు, గణపతి, పోచమ్మ, హనుమంతుడి ఆలయాలున్నాయి. ఆయా దేవుళ్ల విగ్రహాలను తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర శిల్ప కళాశాల నుంచి ప్రత్యేకంగా తాయారు చేయించి తెప్పించారు. కాగా గుడి, మసీదు, చర్చిలను సచివాలయంతోపాటే ప్రారంభించాలని భావించినా నిర్మాణాలు పూర్తి కాకపోవడంతో సాధ్యంకాలేదు.

తెలంగాణ పాత సచివాలయ ప్రాంగణంలో ఉన్న ప్రార్ధనా మందిరాలను తెలంగాణ సర్కార్‌ నూతన సచివాలయ నిర్మాణం తర్వాత పున:నిర్మించింది. గతంలో తెలంగాణ పాత సచివాలయంలో నల్ల పోచమ్మ అమ్మవారి ఆలయం, రెండు మసీదులు, చర్చి ఉండేవి. పాత భవనాల కూల్చివేతల సమయంలో ప్రార్ధనా మందిరాలకు నష్టం వాటిళ్లడంతో ప్రభుత్వ ఖర్చుతోనే పున:నిర్మిస్తామని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.