Home   »  తెలంగాణ   »   MLA Challa Dharma Reddy |పేదల సొంతింటి కల నెరవేర్చేందుకే గృహలక్ష్మి పథకం.

MLA Challa Dharma Reddy |పేదల సొంతింటి కల నెరవేర్చేందుకే గృహలక్ష్మి పథకం.

schedule mounika

పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకానికి శ్రీకారం చుట్టిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి(MLA Challa Dharma Reddy ) అన్నారు.

MLA Challa Dharma Reddy |పేదల సొంతింటి కల నెరవేర్చేందుకే గృహలక్ష్మి పథకం.MLA Challa Dharma Reddy |Grilahakshmi scheme to fulfill the dream of owning the poor.

శుక్రవారం వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గం గీసుగొండ మండలంలోని ఎస్.ఎస్.గార్డెన్స్ లో వివిధ గ్రామాలకు చెందిన 432 మంది గృహలక్ష్మి లబ్ధిదారులకు మంజూరు పత్రాలను జిల్లా కలెక్టర్ ప్రావీణ్య తో కలిసి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ..ప్రభుత్వం అందించే గృహలక్ష్మి పథకం మహిళల పేరుపైనే ప్రవేశపెట్టింది. మొదటి విడతలో ప్రతి నియోజకవర్గానికి 3000 కేటాయించడం జరిగింది.ఇండ్ల నిర్మాణం త్వరగా పూర్తిచేస్తే విడతల వారీగా డబ్బులు కూడా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతాయని తెలిపారు. వరంగల్ జిల్లాలో మొదటగా గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాలు పరకాల నియోజకవర్గంలో పంపిణీ చేసుకుంటున్నట్లు కలెక్టర్ తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి(MLA Challa Dharma Reddy ) మాట్లాడుతూ..గృహలక్ష్మి పథకంలో నియోజకవర్గానికి 3 వేల చొప్పున ఒక్కొక్కరికి రూ.3 లక్షల సాయం అందించనున్నామని తెలిపారు.

ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాలు ఎవరు నమ్మవద్దు :MLA Challa Dharma Reddy.

ఈ పథకంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాలు ఎవరు నమ్మవద్దని వారు తెలిపారు. గత ప్రభుత్వాల హయాంలో వారి అనుచరులకు పథకాలు అందచేశారు కానీ,ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. అనంతరం నియోజకవర్గంలోని సంగెం, గీసుగొండ, GWMC పరిధిలోని వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స చేసుకున్న వారికి సిఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులు కలెక్టర్ పి. ప్రావీణ్య గారితో కలిసి పంపిణీ చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు,సొసైటీ, మార్కెట్ చైర్మన్లు, రైతుబందు కన్వీనర్లు,సభ్యులు, BRS నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.