Home   »  తెలంగాణవార్తలు   »   MBBS కన్వీనర్ కోటా సీట్లపై పిటిషన్

MBBS కన్వీనర్ కోటా సీట్లపై పిటిషన్

schedule raju

హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా ఏర్పాటైన MBBS కాలేజీల్లో ఇతర రాష్ర్టాల విద్యార్థులకు కన్వీనర్ కోటా సీట్లు ఇవ్వకూడదన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలైంది. జస్టిస్ అభినంద్ కుమార్ షావిలి, జస్టిస్ ఎన్ రాజేశ్వర్ రావులతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని దీని వల్ల AP విద్యార్థులు చాలా నష్టపోతారని పిటిషనర్ పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యార్థులకు కన్వీనర్ కోటా లో 100% సీట్లు రిజర్వ్ చేస్తూ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఇటీవల జారీ చేసిన 72 జీవోను రద్దు చేయాలని కాంపిటీటివ్ అథారిటీ అభ్యర్థించింది. తెలంగాణ ప్రభుత్వ వాదనలు వినిపించేందుకు అడ్వకేట్ జనరల్ జె రామచంద్రరావు సమయం కోరడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది.