Home   »  తెలంగాణఉద్యోగంవార్తలు   »   Group-2 పరీక్ష వాయిదా వేయండి: అభ్యర్థులు

Group-2 పరీక్ష వాయిదా వేయండి: అభ్యర్థులు

schedule raju

తెలంగాణ: ఆగస్టు చివర్లో నిర్వహించనున్న Group-2 పరీక్షను వాయిదా వేయాలని నిరుద్యోగ అభ్యర్థులు మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశారు. అదే నెలలో గురుకుల పరీక్షలు ఉండడంతో ప్రిపరేషన్‌కు సమయం లేకపోయిందని పేర్కొన్నారు. గతంలో TSPSC నిర్వహణ పరమైన సమస్యతో పరీక్షకు మానసికంగా సన్నద్ధం కాలేకపోయామని… పరిస్థితిని అర్ధం చేసుకొని తగిన వెసులుబాటు కల్పించాలని లేఖలో కోరారు.

Group-2 అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. ఆగష్టు 29, 30తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కార్యాలయాన్ని ముట్టడించడంతో ఉద్రిక్తత చోటు చేసుకోగా ఇప్పటికే గ్రూప్‌ – 1 ప్రిలిమ్స్‌, గ్రూప్‌ 4 వంటి పరీక్షలను పూర్తి చేయగా.. గ్రూప్‌ – 2 నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. మరోవైపు.. జీవో నెంబర్‌ 46 రద్దు కోరుతూ డీజీపీ కార్యాలయం ఎదుట కానిస్టేబుల్‌ అభ్యర్థులు సైతం ధర్నా చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది.