Home   »  తెలంగాణ   »   గృహలక్ష్మీ దరఖాస్తుల గడువు పెంచాలని నిరసన

గృహలక్ష్మీ దరఖాస్తుల గడువు పెంచాలని నిరసన

schedule raju

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహలక్ష్మీ పథకం దరఖాస్తుల గడువు తేదీ పెంచాలని రామగుండం కార్పొరేషన్‌ 22వ డివిజన్‌ బిజెపి కార్పొరేటర్‌ కౌశికలత ఆధ్వర్యంలో బల్దియా కార్యాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… అర్హులైన పేదలందరికీ గృహలక్ష్మీ పథకం అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లబ్ధిదారులను ఇబ్బందులకు గురి చేయవద్దని పేర్కొన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని చివరికి గృహలక్ష్మి పథకంలో సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకుంటే మూడు లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించి, సంవత్సరాలు తరబడి అమలు చేయకుండా ఉండి హడావుడిగా దరఖాస్తులు స్వీకరణకు అవకాశం ఇస్తూ కేవలం 3 రోజులు వ్యవధిలో ఈనెల 7వ తేదీన గృహలక్ష్మి పథకం దరఖాస్తులు చేసుకొనుటకు 10 వ తేదీన చివరి తేదీ అని ప్రకటించడం వలన అతి తక్కువ సమయంలో ప్రభుత్వం తెలియజేసిన దరఖాస్తుకు అవసరమైన కులం, ఆదాయం సర్టిఫికేట్లు తీసుకోవడానికి దాదాపు 5 రోజులు నుండి 7 రోజులు సమయం పడుతుంది.

ఓకే సారీ వేలమంది వాటికి దరఖాస్తులు ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి వెళ్లే ఆన్లైన్ లోడ్ ఎక్కువై పనిచేయకుండా పోతుంది. మద్యం షాపులపై ఇచ్చిన సమయానికన్నా ప్రజా సంక్షేమ పథకాలకు ఇచ్చే సమయం పై చిత్తశుద్ధి లేనటువంటి ఈ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీసే సమయం ఆసన్నమైందని తెలపడం జరిగింది.