Home   »  తెలంగాణఆంధ్రప్రదేశ్వార్తలు   »   30న PSLV C-56 ప్రయోగం.. రోదసీలోకి సింగపూర్‌ శాటిలైట్స్‌

30న PSLV C-56 ప్రయోగం.. రోదసీలోకి సింగపూర్‌ శాటిలైట్స్‌

schedule raju

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ఈనెల 30న ఉదయం 6.35కు PSLV C-56 ప్రయోగం జరగనుంది. 422 కిలోల బరువున్న ఏడు సింగపూర్‌ ఉపగ్రహాలను రోదసీలోకి సైంటిస్టులు పంపనున్నారు. వాస్తవానికి రేపు ఈ ప్రయోగం జరగాల్సి ఉండగా, చంద్రయాన్‌-3 మిషన్‌ను లూనార్‌ ఆర్బిట్లోకి పంపాల్సి ఉండటంతో ISRO అధికారులు వాయిదా వేశారు.

PSLV C-56 ప్రయోగంలో 422 కిలోలు బరువు కలిగిన సింగపూర్‌కు చెందిన ఏడు ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. 351 కిలోల DS–SRA (షార్ట్‌ ఫర్‌ సింథటిక్‌ ఆపార్చర్‌ రాడార్‌) అనే ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్, 23.58 కిలోలు బరువు కలిగిన ఆర్కేడ్, 23 కేజీల వెలాక్స్‌–AM, 12.8 కిలోలు బరువు కలిగిన ORB12 స్ట్రైడర్, 3.84 కేజీల బరువున్న గలాసియా–2, 4.1 కేజీల బరువైన స్కూబ్‌–11, 3.05 కేజీల నులయన్‌ అనే ఉపగ్రహాలను లోయర్‌ ఎర్త్‌ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టనున్నారు.