Home   »  తెలంగాణ   »   దేశరాజుపల్లిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

దేశరాజుపల్లిలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు

schedule sirisha

హన్మకొండ: దేశరాజుపల్లిలోని EUThub Technologies PVT LTD వారి ఆధ్వర్యంలో నేడు 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day Celebration) ఘనంగా నిర్వహించబడ్డాయి. EUThub తో పాటు marvin వీడియోస్, marvin24 న్యూస్ కలిసి ఈ వేడుకలను నిర్వహించాయి.

దేశరాజుపల్లిలో గణతంత్ర దినోత్సవ వేడుకలు (Republic Day Celebration)

హన్మకొండ: కమలాపురం మండలం, దేశరాజుపల్లి గ్రామంలో EUThub Technologies PVT LTD తో పాటు “Marvin వీడియోస్”, “Marvin24 న్యూస్” కలిసి 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాయి. ఈ కార్యక్రంలో సర్పంచ్ దాసరి రమేష్, ఉపసర్పంచ్ మిట్టపల్లి సుభాష్, ఎంపీటీసీ, ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు , కంపెనీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 8 గంటలకు జెండా ఎగురవేశారు. అనంతరం పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు పంచారు.

భారతదేశ బానిసత్వాన్ని బ్రిటిష్ వారి నుండి 1947,ఆగస్టు 14 అర్ధరాత్రి స్వతంత్రం వచ్చిన తరువాత భారతదేశ రాజ్యాంగాన్ని 284 మంది రచించారు. అందులో ముఖ్యుడు డాక్టర్ అంబేద్కర్. కాగా ఈ రాజ్యాంగాన్ని జనవరి 26, 1950 న అమలులోకి తీసుకొచ్చారు. అందువల్ల ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం జనవరి 26 న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము.