Home   »  తెలంగాణ   »   Revanth Reddy: సీఎం అల్పాహార పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి..

Revanth Reddy: సీఎం అల్పాహార పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి..

schedule mounika

హైదరాబాద్: పాఠశాల విద్యార్థులకు అల్పాహార పథకం అమలుపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy) శనివారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు బహిరంగ లేఖ రాశారు.

పాఠశాలల్లో కనీస వసతుల లేవని, మధ్యాహ్న భోజన కార్మికులకు బిల్లులు చెల్లించకపోవడం, పెరిగిన ధరల ప్రకారం వంట నిర్వహణ ఖర్చులు చెల్లించడం లేదని, గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయడం లేదని, రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అనేక సమస్యలతో సతమతమవుతుంటే, ఈ సమస్యలను పట్టించుకోకుండా సీఎం అల్పాహార పథకం ప్రారంభించడంలో హడావుడి చేస్తున్నారని అన్నారు.

మధ్యాహ్న భోజన పథకం అనేక సమస్యలను ఎదుర్కొంటోందన్నారు. మార్కెట్‌లో ధరలు హెచ్చుతగ్గులకు లోనైతే, ప్రభుత్వం పెరిగిన ధరల ప్రకారం బడ్జెట్‌ను పెంచాలన్నారు. చాలా పాఠశాలల్లో వంటశాలలు సరిగా లేకపోవడంతో ఆరుబయటే చెట్లకింద వంటలు చేస్తున్నారన్నారు. మధ్యాహ్న భోజనం కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురవుతున్న సందర్భాలు ఉన్నాయన్నారు.

భోజన కార్మికులు ధర్నాలు చేస్తున్నా BRS ప్రభుత్వం పట్టించుకోలేదు: Revanth Reddy

గత కొన్ని రోజులుగా మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని ధర్నాలు చేస్తున్నా మీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. పెరిగిన జీతం విడుదల, కొత్త మెనూ బడ్జెట్ పెంపు, పెండింగ్ బిల్లులు విడుదల, జీఓ 8 ప్రకారం బకాయిలతో సహా పెంచిన వేతనాలు వెంటనే చెల్లించాలని, కార్మికులకు ఐడీ కార్డులు, యూనిఫాం, ప్రభుత్వం ఉచితంగా నిత్యావసర వస్తువుల పంపిణీ వంటి అత్యవసరమైన అంశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు..