Home   »  తెలంగాణ   »   బీఆర్ఎస్ పార్టీలో చేరిన R.S ప్రవీణ్..

బీఆర్ఎస్ పార్టీలో చేరిన R.S ప్రవీణ్..

schedule mounika

హైదరాబాద్: BSP పార్టీ అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్ R.S ప్రవీణ్ కుమార్ సోమవారం ఎర్రవల్లి ఫాంహౌస్‌లో BRS పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో (RS Praveen joined BRS party) చేరారు. KCR గులాబీ కండువా కప్పి ప్రవీణ్ ను బీఆర్ఎస్‌లోకి ఆహ్వానించారు. R.S ప్రవీణ్ కుమార్ తో పాటు పెద్ద ఎత్తున BSP నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

కాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిబద్ధత, కష్టపడే వ్యక్తిత్వాన్ని పరిగణలోకి తీసుకున్న KCR, ఆయనకు కీలక పదవి ఆఫర్ చేశారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను త్వరలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తానని ప్రకటించారు. కష్టపడి పనిచేస్తే, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో 100 శాతం ఫలితాలతో బీఆర్‌ఎస్ మరింత పటిష్టంగా అభివృద్ధి చెందుతుందని KCR అన్నారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్‌ పాలనలో వైఫల్యాలతో ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్‌ మోసాలు ప్రజలకు అర్థమవుతున్నాయని KCR వ్యాఖ్యానించారు.

ALSO READ: రైతులు ఆశలు కోల్పోవద్దు: మహమ్మద్ అలీ షబ్బీర్