Home   »  తెలంగాణ   »   తన రికార్డును తానే బ్రేక్ చేసిన సర్కార్ ఆస్పత్రి… ఎందుకంటే…!

తన రికార్డును తానే బ్రేక్ చేసిన సర్కార్ ఆస్పత్రి… ఎందుకంటే…!

schedule sirisha

మహబూబ్ నగర్: వనపర్తి మాతాశిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రం తన రికార్డును తానే బ్రేక్ చేసింది. ఇదే సర్కార్ ఆస్పత్రిలో మూడు నెలల ముందు కూడా ఒక్కరోజులోనే 29 డెలివరీలు విజవంతంగా చేసారు. తల్లులు నవజాత శిశువులు కూడా ఆరోగ్యాంగా ఉన్నారని డాక్టర్ లు తెలిపారు. అదేవిధంగా మరోసారి కూడా 32 ప్రసవాలు చేసి పాత రికార్డును బద్దలు కొట్టింది. శనివారం జరిగిన ప్రసవాల్లో ఇందులో 17 నార్మల్ డెలివరీలు కాగా,15 సిజేరియన్ అయ్యాయి. వారికి 20 మంది మగ, 12 మంది ఆడ శిశువులు జన్మించారు. ఒకే రోజు అత్యధికంగా విజయవంతంగా డెలివరీలు చేసిన డాక్టర్స్ టీమ్‎ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, ఉన్నతాధికారులు అభినందించారు.