Home   »  తెలంగాణ   »   రంగంలోకి దిగనున్న సర్పంచ్ నవ్య

రంగంలోకి దిగనున్న సర్పంచ్ నవ్య

schedule mahesh

హైదరాబాద్: స్టేషన్ ఘన్ పూర్ రాజకీయాలు మరోసారి వార్తల్లో నిలిచాయి. BRS సిట్టింగ్ MLA తాటికొండ రాజయ్యను కాదని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి టిక్కెట్టును CM KCR ప్రకటించారు. MLA రాజయ్య కు మద్దతుగా మంద కృష్ణ మాదిగ తదితరులు సంఘీభావం తెలిపారు. మరోవైపు రంగంలోకి దిగనున్న జానకీపురం సర్పంచ్ నవ్య.

ఏడు దశాబ్దాల చరిత్రలో స్టేషన్ ఘన్ పూర్ నుండి ఒక మహిళకు ఏనాడూ అవకాశం ఇవ్వలేదని ఈ సారి తనకు అవకాశం ఇవ్వాలని నవ్య అంటోంది. ఈ రోజు సర్పంచ్ నవ్య హైదరాబాద్ వెళ్లి పలువురు BRS పార్టీ నేతలను కలవనున్నారు. టికెట్ కోసం విజ్ఞప్తి చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో MLA రాజయ్య పై పలు ఆరోపణలు చేసిన నవ్య రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు టికెట్ రేసులో కడియం పోటీ చేయడం, స్టేషన్ ఘన్ పూర్ రాజకీయాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.