Home   »  తెలంగాణవార్తలు   »   రెండో ప్రమాద హెచ్చరిక జారీ

రెండో ప్రమాద హెచ్చరిక జారీ

schedule raju

భద్రాచలం దగ్గర గోదావరి వరద పెరుగుతోంది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటిమట్టం రాత్రి 9.45 గంటలకు 48.44 అడుగులకు చేరుకుంది. ఈనేపథ్యంలో టేకులగూడెం, వీరభద్రవరం, సురవీడు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. నీటిప్రవాహం పెరగడంతో కలెక్టర్‌ ప్రియాంక రెండు రోజులు జిల్లాలో రెండో ప్రమాద హెచ్చరిక ప్రకటించారు.

ఎగువ ప్రాంతం నుండి వచ్చే వరదతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంట గంటకు వేగంగా  పెరుగుతోంది. లోతట్టు గ్రామాల ప్రజలు పునరావాస కేంద్రాలకు తరలిరావడానికి సహకరించాలి. గోదావరికి ఎగునున్న ప్రాజెక్టుల నుంచి ఉదృతంగా నీరు వస్తున్నందున ఈ రోజు సాయంత్రం వరకు భద్రాచలం వద్ద గోదావరి 60 అడుగులకు చేరే అవకాశం ఉంది. జలాశయాల వద్దకు ప్రజలు రావద్దు. వరద నిలిచిన రహదారులల్లో రవాణా నియంత్రణకు ట్రాక్టర్లు అడ్డు పెట్టాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. 

రెండు తెలుగు రాష్ట్రాలలోనూ గోదావరి వరదల నేపథ్యంలో ఆందోళనకర పరిస్థితి ఉంది. గోదావరి నదిలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో రెండు రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు. గోదావరి నది పరివాహక ప్రాంతాలలో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దు.