Home   »  తెలంగాణ   »   Snatching | దొంగల ముఠా అరెస్టు చేసిన పోలీసులు

Snatching | దొంగల ముఠా అరెస్టు చేసిన పోలీసులు

schedule sirisha

ఈజీగా డబ్బు సంపాదించేందుకు పథకం వేశాడు. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లో వీడియోలు చూసి Snatching లకు పాల్పడుతున్న ఓ యువకుడిని పోచంపల్లి పోలీసులు ఆరు గంటల వ్యవధిలో అరెస్టు చేశారు.

ఎల్బీనగర్‌లోని రాచకొండ పోలీసు కమిషనర్‌ డీఎస్‌ చౌహాన్‌ కేసు వివరాలను వెల్లడించారు. ఆన్‌లైన్‌లో పేకాట,క్రికెట్‌ బెట్టింగ్‌ ఆడుతూ భారీగా నష్టపోయాడు.

పోచంపల్లికి చెందిన లక్ష్మమ్మ(65) నడుచుకుంటూ వెళ్తుండగా బైక్‌పై వచ్చిన యువకుడు ఆమె మెడలో నుంచి పుస్తెలతాడు లాక్కొని పారిపోయాడు.

ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. సీసీ కెమెరాలు, ఆ గ్రామానికి వచ్చిపోయే మార్గాలపై పోలీసులు నిఘాపెట్టి నిందితుడిని ఆరు గంటల్లో పట్టుకున్నారు.

విచారణలో అతడు హయత్‌నగర్‌లో ఉంటూ ఆర్టీఏ ఏజెంట్‌గా పని చేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. దీంతో అతడికి ఈజీగా డబ్బు సంపాదించాలనే ఆలోచన పుట్టింది.

స్నాచింగ్‌లు చేసి డబ్బు సంపాదించాలి అని అనుకున్నాడు. అందుకు యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లో స్నాచింగ్‌లు ఎలా చేయాలో చూసి నేరాలు ఎలా చేయాలో నేర్చుకున్నాడని వివరించారు.

నిందితుడికి పెళ్లి అయ్యిందని, ఆన్‌లైన్‌లో పేకాట, క్రికెట్‌ బెట్టింగ్‌, మద్యం,మత్తుకు బానిసై దాదాపు రూ.20 లక్షలు నష్ట పోయాడని సీపీ తెలిపారు.

Snatching ముఠా అరెస్టు:

ఇంటి తాళాలు పగులగొట్టి చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను కీసర పోలీసులు అరెస్టు చేశారు.

ఈ ముఠా 22 చోరీలకు పాల్పడ్డారు. చాలా కాలంగా తప్పించుకు తిరుగుతున్న ఈ ముఠాను కీసర పోలీసులు అరెస్టు చేశారు.

సీపీ డీఎస్‌ చౌహాన్‌ కథనం ప్రకారం.. మేడ్చల్‌ జిల్లా జవహర్‌నగర్‌కు చెందిన రామకృష్ణ (35), చెన్నాపురం దేవేందర్‌నగర్‌ నివాసి కాగ్‌ గోవింద్‌ (36), మహేందర్‌ పవార్‌ (36), సంతోష్‌ (40) ఒక ముఠాగా ఏర్పడ్డారు.

ఈ ముఠా నుంచి రూ.50 లక్షల విలువజేసే 680 గ్రాముల బంగారు నగలు, 2479 గ్రాముల వెండి వస్తువులు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

వీరిలో రామకృష్ణ ఆన్‌లైన్‌ గేమింగ్‌లో నష్టపోయాడు. ఇదిలా ఉండగా, ఈ నలుగురు కలిసి తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్‌ చేసుకొని దొంగతనాలు చేస్తున్నారు.

వీరి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కీసర పోలీసులను రాచకొండ సీపీ డీఎస్‌ చౌహాన్‌ అభినందించారు.

ఈ సమావేశంలో మల్కాజిగిరి ఇన్‌చార్జి డీసీపీ గిరిధర్‌, కీసర ఇన్‌స్పెక్టర్‌ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.